టెక్నాలజీతో నేరాల నియంత్రణ: డీజీపీ

బషీర్ బాగ్ లోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని చీఫ్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు. కమిషనరేట్ పరిధిలో ఉపయోగిస్తున్న టెక్నాలజీని గురించి వివరాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్ తో ఫేషియల్ రికగ్నేషన్ ల్యాబ్ ను పరిశీలించారు. టెక్నాలజీతో నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు విధానాన్ని సీపీ అంజనీకుమార్ సీఎస్ కు వివరించారు. దీంతో పాటు రానున్న రోజుల్లో తాము తీసుకువచ్చే ఆధునిక టెక్నాలజీ కోసం డీజీపీ మహేందర్ రెడ్డి సలహాలు, సూచనలను సీపీ అంజనీకుమార్ తీసుకున్నారు. అదనపు డీజీలు జితేందర్ తో పాటు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Latest Updates