వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై క్రిమినల్ కేసులు నమోదు

సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.  సోషల్ మీడియా గ్రూప్స్ లో కొందరు సున్నితమైన, మతపరమైన అంశాలను రెచ్చ గొడుతూ, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని   సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం కోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు 14 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు చేయమని ఆర్డర్స్ జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు  కేసు (ఎఫ్ఐఆర్ నెంబర్ 374/2020) నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

గత సంవత్సరం డిసెంబర్ 12న భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన పౌరసత్వసవరణ చట్టంకు వ్యతిరేకంగా సదరు సోషల్ మీడియా యాప్స్..  శాసనాన్ని ధిక్కరిస్తూ దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని శ్రీశైలం మొదట హైదరాబాద్ నగర పోలీసులను కలిశారు.  స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్ మహంతి ని కలసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టుపే ఆశ్రయించారు. వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లు ఈ ప్రచారాలకి వేదిక అవుతున్నాయని శ్రీశైలం తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇందుకు తార్కాణంగా కొన్నివాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్  గ్రూప్ ల వివరాలను కూడా పిర్యాదులో జతచేసారు.

వీటన్నిటిని పరిశీలించిన మేజిస్ట్రేట్ సైబర్ పోలీస్ లకు రిఫర్ చేశారు. దీనితో దేశంలోనే మొట్టమొదటి సారిగా సోషల్ మీడియా యాప్స్ పై కేసులు నమోదైనట్లైంది. ఈ క్రింది ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 153A, 121 A, 124, 124 A, 294, 295 A, 505, 120 B, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66A క్రింద కేసులు నమోదు కాబడ్డాయి.

criminal-cases-registered-against-social-media-apps-whatsapp-twitter-and-tik-tok

Latest Updates