సుశాంత్‌ రాజ్‌పుత్‌ సూసైడ్‌: సల్మాన్‌ఖాన్ తదితరులపై కేసు

  • బీహార్‌‌ కోర్టులో క్రిమినల్‌ కంప్లైంట్‌ ఫైల్‌
  • సాక్షిగా కంగనా రనౌత్‌

పాట్నా: బాలీవుడ్‌ స్టార్‌‌ సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు సంబంధించి హీరో సల్మాన్‌ ఖాన్‌, కరన్‌ జోహార్‌‌తో పాటు మరో 8 మందిపై క్రిమినల్‌ కంప్లైంట్‌ నమోదైంది. బీహార్‌‌కు చెందిన అడ్వకేట్‌ సుధీర్‌‌ కుమార్‌‌ ఓఝా లోకల్‌ కోర్టులో కంప్లైంట్‌ ఫైల్‌ చేయగా.. కోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. జులై 3న దానిపై విచారణ జరిపనుంది. హీరో సల్మాన్‌ ఖాన్‌, కరన్‌ జోహార్‌‌, ఆదిత్య చోప్రా, సాజిద్‌ నదియాద్వాలా, సంజయ్‌ లీలా బన్సాలీ, భూషణ్‌ కుమార్‌‌, ఎక్తాకపూర్‌‌, డైరెక్టర్‌‌ దినేశ్‌ల వల్లే సుశాంత్‌ సూసైడ్‌ చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఎనిమిది మంది సుశాంత్‌ సినిమాలు రిలీజ్‌ కాకుండా చేశారని, బాలీవుడ్‌ ఫంక్షన్‌లక కూడా ఇన్వైట్‌ చేయకుండా వెలివేసారని ఆ మనస్తాపంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓఝా అన్నారు. సుశాంత్‌ మరణ వార్త కేవలం బీహార్‌‌ వాసులనే కాదని, యావత్తు భారతదేశాన్ని కలచివేసిందని చెప్పారు. ఈ మేరకు ఆ 8మందిపైన 306,109,504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను సాక్షిగా చేర్చారు. ధోనీ, కేదార్‌‌‌నాథ్‌, చిచోరే లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సుశాంత్‌ ఆదివారం ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.  సల్మాన్‌ఖాన్‌, కరన్‌ జోహార్‌‌ తదితరులు సుశాంత్‌ను వెలివేసారని అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలు సోషల్‌ మీడియాలో కూడా హల్‌చల్‌ చేశాయి.

Latest Updates