డాన్ల రాజ‘కీ‘యం

criminal-poltics-in-bihar

దేశంలో ‘క్రిమినల్ పాలిటిక్స్’, ‘పొలిటికల్ క్రిమినల్స్’ ఎక్కువ ఉన్న రాష్ర్టం బీహార్. గతంలో బందిపోట్లరాజ్యం, తర్వాత డాన్లు, గ్యాం గ్ స్టర్ల హవా కారణంగాఅక్కడి రాజకీయాల్లో ఈ వాతావరణం కనిపిస్తుం ది.కోర్టు కేసుల్లో దోషులుగా తేలిన కొందరు డాన్లు,గ్యాం గ్ స్టర్లు పొలిటికల్ పవర్ ను నిలబెట్టుకునేందుకు తమ భార్యలు, పిల్లలు, బంధువులను నిలబెడుతున్నారు. బీహార్ లోని పార్టీల నాయకత్వాలు కూడా ఎలాంటి సంకోచం లేకుండా వారికి టికెట్లు ఇచ్చేస్తున్నాయి. ఇదేమీ పెద్ద విషయం కాదన్నట్టు గా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఈ తరహా రాజకీయంసర్వసాధారణమైపోయిం ది. ఆర్జేడీతో మొదలుకొనిజేడీయూ, ఎల్జేపీ, కాం గ్రెస్ వరకూ అన్ని పార్టీలు డాన్లఫ్యామిలీ మెంబర్లను లోక్ సభ ఎన్నికల్లో పోటీలో పెడుతున్నాయి.

 షాహబుద్దీన్ భార్యకూ

కరుడుగట్టిన డాన్, మాజీ ఎంపీ మొహమ్మద్ షాహబుద్దీన్ భార్య హీనా సాహెబ్ ను బరిలో నిలిపేందుకు ఆర్జేడీ ప్రయత్నాలు చేస్తోంది. హత్య, కిడ్నాపింగ్ వంటిఏడు కేసుల్ లో దోషిగా తేలిన ఈయన ఇప్పటికీ ఆర్జేడీపార్టీ నేషనల్ ఎగ్జిక్యూ టివ్ లో మెంబర్ గా కొనసాగుతున్నారు. ఇదీ అక్కడి రాజకీయం.

రేపిస్టు ఎమ్మెల్యే భార్యకు టికెట్

రాష్ర్టీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఈనెల 22న లోక్ సభఅభ్యర్థు ల తొలి జాబితాను ప్రకటించింది. నవాడానుం చి విభ కుమారి అనే వ్యక్తిని బరిలో నిలబెడుతున్నట్లు ప్రకటించిం ది. అంతే.. ఆర్జేడీతో కలసి పోటీచేస్తున్న భాగస్వా మ్య పార్టీలు ఒక్క సారిగా షాక్ కుగురయ్యా యి. ఇలా అయితే గెలిచేదెలా? అని ప్రశ్నించాయి. ఎందుకంటే ఆమె రాజ్ బల్లభ్ యాదవ్ భార్య మరి ఈ రాజ్ యాదవ్ ఎవరంటారా? మైనర్ ను రేప్చేసి, కోర్టులో దోషిగా తేలి,ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్యే . దీనిపై భాగస్వా మ్య పక్షాల నుంచివ్యతిరేకత వస్తుంటే ఆర్జేడీ రాష్ర్ట అధ్యక్షుడు రామ్ చంద్ర పర్బే ఏం చెప్పారో తెలుసా?… “రాజ్ యాదవ భార్యను అభ్యర్థి గా ప్రకటిం చడంలో తప్పేం లేదు. రాజ్ తన కేసును పై కోర్టులో అప్పీ ల్ చేశారు. ఎలాంటితప్పూ చేయని విభ కుమారికి టికెట్ ఎందుకు ఇవ్వకూడదు”అని ఎదురు ప్రశ్నించారాయన.

కొడుక్కి టికెట్ ఓకే

ప్రభునాథ్ సిం గ్ రెండు సార్లు ఎంపీగా గెలిచాడు.1990ల్లో ఎమ్మెల్యే ను హత్య చేసిన కేసులో ప్రస్తుతంజైల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు తన కొడుకునుపోటీలో నిలబెట్టాలని చూస్తున్నాడు. గతంలో ప్రభునాథ్ ప్రాతినిథ్యం వహించిన మహరాజ్ గంజ్ ను అతడి కొడుకు రణ్ ధీర్ సిం గ్ కే కేటాయించేందుకుఆర్జేడీ ప్రయత్నిస్తోంది.

పాశ్వాన్ కూడా తక్కువ

తినలేదు డాన్ల ఫ్యామిలీ మెంబర్లకు టికెట్లు ఇచ్చే వ్యవహారంఆర్జేడీ, జేడీయూలకు మాత్రమే పరిమితం కాలేదు.లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రామ్ విలాస్ పాశ్వా న్ కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న డాన్, మాజీ ఎంపీ సురబ్జన్ సిం గ్ బంధువులకు టికెట్లు ఇస్తున్నారు. సురబ్జన్ తమ్ము డు చందన్ కుమార్ ను నవాడా నుం చి బరిలో నిలుపుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో సురబ్జన్ భార్య వీనా దేవి.. ముంగార్ నుం చి పోటీ చేసి గెలిచారు. తాజాగా ఎన్డీఏ సీట్ల పంపకంలో ముంగార్ సీటు జేడీయూకు వెళ్లింది. దీం తో నవాడా నుం చి చందన్ పోటీ చేస్తున్నాడు.

Latest Updates