సిగ్నల్ టాంపర్ చేసి రైళ్లలో దోపిడీలు

రైల్ ఎక్కడ ఉందనే సమాచారాన్ని ముందుగా రైల్ యాప్ ద్వారా తెలుసుకుంటారు. రైలు వస్తున్న విషయాన్ని  పక్కాగా తెలుసుకుని సిగ్నల్న్ ట్యాంపరింగ్ చేస్తారు. రైలు ఆగిన వెంటనే పడుకున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతారు.. ముఠా సభ్యులు ఒకరిపై ఒకరు ఎక్కి రైలు కిటికీల దగ్గర నుండి వారి నగలను దోచుకుంటారు. తిరగబడితే రాళ్లతో ప్రయాణికులపై దాడి చేస్తారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ..పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన పార్ధి గ్యాంగ్ గత కొన్నాళ్లుగా సిగ్నల్ ట్యాంపరింగ్ లకు పాల్పడుతూ ప్రయాణికుల నుండి విలువైన వస్తువులను దోచుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గతేడాది దివిటీ పల్లి దగ్గర సిగ్నల్న్ ట్యాంపరింగ్ మహబూబ్ నగర్  జబల్పూర్ ఎక్స్ ప్రెస్, యశ్వంతాపూర్ ఎక్స్ ప్రెస్ ను నిలిపేసి 37 తులాల కు పైగా బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీరు దొంగిలించిన నగలను గణేష్ భోంస్లే అనే వ్యక్తికి అమ్ముతారని పోలీసులు తెలిపారు. పార్థి గ్యాంగ్ లో అయిదారు బృందాలుగా ఏర్పడి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆయన చెప్పారు. బాలాజీ షిండే అనే వ్యక్తి సోలాపూర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు..బాలాజీ షిండే తో సహా పార్థి  గ్యాంగ్ సభ్యులు  2016లో పూణే ,గుత్తి ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ లో ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. వారినుండి తులం బంగారం, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీనివాస రావు తెలిపారు.

సిగ్నల్ ట్యాంపరింగ్ విషయంలో వీరికి మరెవరైనా సహకరిస్తున్నరా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు.

Latest Updates