వ్యవసాయ భూమిలో మొసలి కలకలం

వ్యవసాయం పొలంలో మొసలి కనిపించడంతో భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు పొలంలో పని చేస్తున్న కూలీలు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మాన్స్ సాన్ పల్లికి చెందిన నర్సింహ్మ రెడ్డి.. తన పొలంలో కూలీలతో పనిచేయిస్తుండగా వారికి మొసలి కనిపించింది. వెంటనే వారు మొసలి బారి నుంచి  తృటిలో తప్పించుకున్నారు .ఈ విషయాన్ని  ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వారు ఆ మొసలిని బంధించి,  సంగారెడ్డి కలబ్గూర్ దగ్గరున్న మొసళ్ల  సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Latest Updates