జాలరి వలకు మొసలి చిక్కింది

ఖమ్మం: జాలరి వలలో ఓ పెద్ద మొసలి చిక్కింది. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో మోతె మండలం, నర్సింహపురం గ్రామానికి చెందిన వెంకన్న అనే జాలరి బుధవారం పాలేరు జలాశయంలో చేపలు పట్టడానికి వల విసిరాడు. దీంతో అందులో ఓ పెద్ద మొసలి చిక్కింది. భయాందోళను గురైన మత్స్యకారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. మొసలిని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు మొసలి 70కిలోలు ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ మొసలిని ఫారెస్ట్ అధికారులు తిరిగి జలాశయంలో వదులుతుండటంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేశారు.

 

Latest Updates