కాడెద్దులుగా మారి భూమి సాగు చేస్తున్న భార్యభర్తలు

ములుగు జిల్లా : యంత్రాలు కొనుగోలు చేసే స్తోమత లేని సన్నకారు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమి లేక కొందరు కాడెద్దు అవతారమోత్తాల్సి వస్తోంది. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు-మెట్లగూడెంలో శంకర్,ఆది లక్ష్మీ అనే దంపతులు ఎకరం భూమిలో సాగు చేస్తున్నారు. అయితే భూమి దున్నడానికి కాడెద్దులు లేవు.. పక్కవారిని అడిగిన ఏ ఒక్కరు ఇవ్వలేదు. దీంతో చేసేదేమి లేక భార్యభర్తలిద్దూ కాడెద్దులుగా మారి బంధువు సాయంతో  భూమి దున్నుకున్నారు. పొద్దంతా కష్టపడి పత్తిపంటను దున్నారు. తమకు ఆర్ధిక స్తోమత, ఎడ్లను ఇవ్వకపోవడంతోనే తాము కాడెద్దులుగా మారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates