పన్నుకట్టే కోటీశ్వరుల డేటా విడుదల

దేశంలో 500 కోట్లకు పైగా ఆదాయం ముగ్గురికేనట

97 వేల మంది కోటి రూపాయల పైగా ఆదాయం

డేటా బయటపెట్టిన ఆదాయ పన్ను శాఖ

న్యూఢిల్లీ: దేశంలోని కోటీశ్వరుల వివరాలను ఆదాయపన్ను శాఖ బయటపెట్టింది. కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఇన్ కమ్ టాక్స్ కడుతున్నవారి రిపోర్ట్ ను విడుదల చేసింది.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.కోటి పైగా సంపాదిస్తున్న వారు 97 వేల మంది ఉన్నారని ఐటీ డిపార్ట్ మెంట్ డేటా చెబుతోంది. అంతకుముందటి ఏడాదితో పోలిస్తే కోటీశ్వరుల సంఖ్య 20 శాతం పెరిగింది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో కోటి పైగా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంతో 81,344 మంది ఉన్నారు. అయితే 2017-18లో రూ.500 కోట్లపైగా ఆదాయం ఉన్నోళ్లు ముగ్గురేనట. వారి పేర్లను మాత్రం ఐటీ శాఖ బయటపెట్టలేదు.

ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైలింగ్ ఆధారంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) విడుదల చేసిన రిపోర్టు ఇది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయానికి 2018-19లో కట్టిన పన్ను వివరాల ఆధారంగా ఈ నివేదిక రెడీ అయింది.

ఐటీ శాఖ రిపోర్ట్ లోని కీలకమైన విషయాలు (2018-19 రిటర్న్స్)

  • 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇన్ కం ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.500 కోట్లకు పైగా సంపాదించినోళ్లు కేవలం ముగ్గురే. వారి పేర్లను మాత్రం ఐటీ శాఖ ప్రకటించలేదు.
  • జీరో రిటర్న్స్ ఫైల్ చేసినోళ్లు 1.7 లక్షల మంది. అంటే తమ ఆదాయం పన్ను పరిధిలోకి రాదని ప్రభుత్వానికి అధికారికంగా చెప్పిన వారి సంఖ్య ఇది.
  • కోటి నుంచి 5 కోట్ల మద్య సంపాదిస్తున్నమంటూ ఐటీ కట్టిన వాళ్లు 89,793 మంది ఉన్నారు.
  • 5-10 కోట్ల మధ్య ఆదాయం ఉన్నోళ్లు 5,132 మంది పన్ను కట్టారు.
  • 10-25 కోట్ల ఆదాయం ఉన్న వాళ్లు 2 వేల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు.
  • జీతాల ద్వారా వచ్చే ఆదాయంతో ఐటీ కట్టినోళ్లలో 5.5 లక్షల నుంచి 9.5 లక్షల మధ్య జీతం తీసుకుంటున్నోళ్లే ఎక్కువగా ఉన్నారు. వీళ్లే 81 వేల మందికి పైగా ఐటీ కట్టారు.
  • వ్యక్తిగతంగా, హిందూ యూనిఫైడ్ ఫ్యామిలీస్, కంపెనీలు, పారిశ్రమికవేత్తలు ఇలా అన్ని కేటగిరీలు కలిపి కోటి రూపాయలపైగా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వారు 1.67 కోట్ల మంది ఉన్నారు. ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 19 శాతం ఎక్కువ.
  • దేశం మొత్తం మీద 5.87 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఇందులో 5.2 కోట్ల మంది వ్యక్తులు, 11.3 లక్షల ఫ్యామిలీస్, 12.69 లక్షల సంస్థలు, 8.41 లక్షల కంపెనీలు ఉన్నాయి.

Latest Updates