నకిలీ ATM కార్డులతో కోట్లు కొట్టేస్తున్నముఠా అరెస్ట్

హైదరాబాద్ లో మరో నకిలీ ముఠా పట్టుబడింది. నకిలీ డెబిట్, క్రెడిట్ కార్డులను సృష్టించి వేరే వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుండి కోట్లాది రూపాయలను కొట్టేసిన 10 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్క రోజులోనే 3 లక్షల కాల్స్ వచ్చాయంటూ ICICI బ్యాంకు రీజనల్ మేనేజర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. రెడ్ బస్ యాప్‌లో 3 లక్షల నెంబర్లను ర్యాండమ్‌గా ఎంటర్ చేసి వాటి డాటా తీసుకొని, 3,500 నకిలీ కార్డులు తయారు చేశారు. వాటి నుండి 3 కోట్లను విత్ డ్రా చేసారని తెలిపారు. నిందితులు జార్ఖండ్ రాష్ట్రం జంతారా జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.

 

Latest Updates