సిడ్నీ మూడో టెస్టుకు 25శాతం ప్రేక్షకులు

కరోనా వైరస్‌ కొత్త కేసులు పెరగడంతో సిడ్నీ వేదికగా జరగనున్న ఇండియా,ఆస్ట్రేలియా మూడో టెస్టుకు 25శాతం అభిమానులను అనుమతించనున్నారు సీఏ అధికారులు. 38వేల సామర్థ్యం ఉన్న సిడ్నీ గ్రౌండ్ లో సుమారు 9,500 మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. భౌతిక దూరం తదితర నిబంధనలు పాటించేందుకు తక్కువ మందినే అనుమతిస్తున్నామన్నారు. ఇప్పటికే టికెట్లు తీసుకున్నవారికి నగదు వాపస్‌ చేస్తున్నామని తెలిపారు. రూల్స్ కు అనుగుణంగా మరోసారి టికెట్ల అమ్మకాలు చేపట్టనున్నట్లు సీఈవో నిక్‌ హాక్లీ తెలిపారు.

మరోవైపు రోహిత్‌శర్మ సహా ఐదుగురు క్రికెటర్లు, అదేవిధంగా అంతకుముందు టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా కూడా మాస్కులేకుండా బయటవారిని కలిసి నిబంధనలు ఉల్లంఘించారని ఆసీస్‌ మీడియా ప్రచారం చేస్తోంది. దీనిపై స్పందించిన టీమిండియా అధికారులు… స్టేడియాల్లోకి పూర్తిస్థాయిలో అభిమానులను అనుమతించిన తర్వాత ఇక మాస్కులు పెట్టుకోవడం, భౌతికదూరం నిబంధనలకు అర్థం ఏముందని అంటున్నారు.

Latest Updates