డీఆర్డీఓ రూపొందించిన బైక్ అంబులెన్స్

దేశ రక్షణ కోసం ఆయుధాలు రూపొందించే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)ప్రజా ఉపయోగ ఆవిష్కరణలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. తాజాగా DRDO పరిశోధకులు ఓ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. సీఆర్పీఎఫ్ సూచనలతో ఈ బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేశారు. CRPF,DRDO కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బైక్ అంబులెన్స్ “రక్షిత”ను నేడు ప్రారంభించారు.

ఈ బైక్ అంబులెన్స్ ను మావోయిస్టు ప్రభావిత అటవీప్రాంతాల్లోనూ, కొండ ప్రాంతాల్లోనూ వినియోగించేందుకు అనువుగా మలిచారు. భద్రతా బలగాల్లో ఎవరైనా గాయపడితే అత్యవసర పరిస్థితుల్లో వారిని తరలించేందుకు ఈ బైక్ అంబులెన్స్ లు ఉపయోగిస్తారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులకు మార్పులు, చేర్పులు చేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ల సమయంలో ఏదైనా గాయాలు జరిగితే ఈ బైక్‌లు సిఆర్‌పిఎఫ్ జవాన్లు, పారామెడిక్స్‌కు సహాయ పడనున్నాయని అధికారులు తెలిపారు.

ఈ బైక్‌లు బీజాపూర్, సుక్మా, దంతేవాడ మొదలైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే, పెద్ద అంబులెన్స్‌లను అడవి లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలిపారు సీఆర్‌పిఎఫ్ అధికారులు. ఇటువంటి బైక్‌లు సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్‌లు వినియోగించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నక్సలైట్ జోన్లలో ఇరుకైన రోడ్లలో వేగంగా చేరుకోవడానికి CRPFగమనించిన తర్వాత ఈ బైక్ అభివృద్ధి చేసారు. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించారు. సీఆర్పీఎఫ్ సూచనలతో ఈ బైక్ అంబులెన్స్‌ను రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసింది.

Latest Updates