బారాముల్లాలో టెర్రర్‌‌ ఎటాక్‌.. సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, సివిలియన్‌ మృతి

  • మరో ముగ్గురు జవాన్లకు గాయాలు
  • తప్పించుకున్న టెర్రరిస్టులు

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం టెర్రరిస్టులు జరిపిన దాడిలో ఒక సీఆర్‌‌పీఎఫ్‌ జావాను, సివిలియన్‌ చనిపోయారు. పెట్రోల్‌ పార్టీ టీమ్‌పై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సీఆర్‌‌పీఎఫ్‌ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్‌ ఇస్తుండగా.. ఒక జవాను అమరుడైనట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఫ్యామిలీతో అటుగా వెళ్తున్న వ్యక్తికి బుల్లెట్లు తగలడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడన్నారు. కారులో వచ్చిన టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని సీనియర్‌‌ సపోలీసు అధికారి అన్నారు. ఆ ఏరియా మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కార్డెన్‌ సెర్చ్ నిర్వహిస్తున్నారు.

Latest Updates