సీఆర్పీఎఫ్​ జవానుకు వైరస్

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవానుకు కరోనా సోకింది. జమ్మూకాశ్మీర్ లో డ్యూటీలో ఉన్న బెటాలియన్ లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని ఒక సీనియర్ ఆఫీసర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. నర్సింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆ జవానును ఢిల్లీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు తెలిపారు. అయితే అతను సెలవు మీద ఇంటికి వెళ్లి తన యూనిట్ లో చేరడానికి ముందు ఏప్రిల్ 7 నుంచి 14 రోజులు క్వారంటైన్ లో ఉంచామని, మంగళవారం శాంపిల్ టెస్టుకు పంపించగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

Latest Updates