భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపిన సీఆర్పీఎఫ్ జవాను

న్యూఢిల్లీ: ఓ సీఆర్పీఎఫ్ జవాను దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున అలహాబాద్ లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) గ్రూప్ సెంటర్లో ఈ ఘటన జరిగిందని అధికారులు మీడియాకు తెలిపారు. సీఆర్పీఎఫ్ 224 వ బెటాలియన్లో డ్రైవర్ గా పనిచేస్తున్న వీకే యాదవ్.. తన భార్య, కూతురు, కొడుకును..సర్వీస్ పిస్టల్ తో కాల్చి చంపాడని వారు తెలిపారు. స్పాట్​ను పరిశీలించిన ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Latest Updates