అమరులైన జవాన్లు వీరే: మిన్నంటిన కుటుంబాల రోదన

పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. జవాన్ల మృతి.. వాళ్ల కుటుంబాలలో కోలుకోలేని దుఖ్ఖాన్ని మిగిల్చింది. బార్డర్ లో.. ఉగ్రవాదులను ఏరివేస్తూ దేశప్రజలు సంతోషంగా ఉండటానికి కారణమవుతున్న జవాన్లు ఉగ్రదాడిలో బలవడంతో దేశం మొత్తం ఏకతాటిపై ఖండించింది. మళ్లీ వస్తానని చెప్పి బార్డర్ కు వెళ్లిన తల్లికి కొడుకు, భార్యకు భర్త, చెల్లికి అన్న…… తిరిగి రాలేని లోకాలకు వెళ్లడంతో వాళ్ల కుటుంబ సభ్యుల రోధనలు ఆకాశాన్నంటాయి.

40మంది CRPF జవాన్లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వారి ఫొటో రిలీజ్ చేశారు అధికారులు.

వీరు బొన్నమాల సంట్ర(70) బబ్లూ సంట్రా అనే CRPF జవానుకు తల్లి.. ఇతను పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందాడు.
వీరు కౌషల్ కుమార్ రావత్ అనే CRPF జవాన్ కు చెందిన కుటుంబం. వీరు ఆగ్రకు చెందిన వారు.

వీరు జైమల్ సింగ్ అనే CRPF జవానుకు చెందిన కుటుంబం. వీరు పంజాబ్ కు చెందిన వారు.

వీరు రమేష్ యాదవ్ కు చెందిన CRPF జవాను కుటుంబం. ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారు.
పంకజ్ త్రిపాఠి అనే CRPF జవానుకు చెందిన కుటుంబం. ఇతనికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. వీరు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారు.
వీరు మనిందర్ సింగ్ అనే CRPF జవానుకు చెందిన కుటుంబం.. వీరు పంజాబ్ కు చెందిన వారు.

Latest Updates