మహారాష్ట్రలో భారీ కూంబింగ్

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఐఈడీ బ్లాస్ట్ తో 16 మంది పోలీసులను బలి తీసుకున్న మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కుర్ ఖేడా అడవుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఘటన జరిగిన సమీప ప్రాంతంలోని అడవులను జల్లెడ పడుతున్నారు. పేలుడు జరిపి ఎంతో దూరం పారిపోలేరని నిర్ధారించిన పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశాయి. మరోవైపు ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర డీజీపీ, ఐజీ, గడ్చిరోలి జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా యాంటీ నక్సల్స్ అధికారులు పరిశీలించారు. ప్రమాద తీవ్రత, జరిగిన తీరును అబ్జర్వ్ చేశారు.

Latest Updates