మళ్లీ పుల్వామాలో CRPF బంకర్ పై టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడి

జమ్ముకశ్మీర్ : సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. మరోసారి పుల్వామాలో CRPF బలగాలను టార్గెట్ చేశారు. ఈ మధ్యాహ్నం జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ టార్గెట్ గా గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన ఓ జవాన్ కు గాయాలయ్యాయి.

పుల్వామా లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ దగ్గర CRPF బంకర్ ఉంది. ఈ బంకర్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. దూరం నుంచి బాంబులు విసిరారు.

ఆ సమయానికి బంకర్ లో CRPF జవాన్లు ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడున్న ఓ జవాన్ గాయపడ్డాడు. బాంబు దాడితో అక్కడ ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడి సమచారంతో CRPF జవాన్లు అలర్టయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates