ఎదురుకాల్పుల్లో అమరుడైన సీఆర్పీఎఫ్‌ జవాన్‌

  • ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌ పుల్వామా జిల్లాలోని బుందోజ్‌ ఏరియాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఇద్దరు టెర్రిస్టులను సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. టెర్రరిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌‌పీఎఫ్‌ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. బుందూజ్‌ ఏరియాలో టెర్రరిస్టులు దాక్కురనే పక్కా సమాచారంతో మన సైనికులు కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు. ఆ సమయంలో ఒక ఇంట్లో నక్కి ఉన్న టెర్రరిస్టులు కాల్పులకు దిగటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక జవానుకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించగా అతడు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయినట్లు సెక్యూరిటీ అధికారులు చెప్పారు. మరో ముగ్గురు టెర్రరిస్టులు కూడా ఉన్నారనే సమాచార ఉందని, వారి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నామని అన్నారు. ఎన్‌కౌంటర్‌‌ జరిగిన ప్లేస్‌లో ఏకే–47 గన్‌తో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Latest Updates