మర్చిపోం… క్షమించం.. ప్రతీకారం తీర్చుకుంటాం: CRPF

దేశ భద్రతలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ .. ఉగ్రవాదులు కొట్టిన దెబ్బతో రగిలిపోతోంది. ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. దేశ రక్షణలో.. విధి నిర్వహణలో ఉండగా అమరులైన తమ సహ జవాన్లు, భరత మాత బిడ్డలకు సెల్యూట్ చేసింది. “మేం మర్చిపోం… మేం వాళ్లను క్షమించం” (“వి విల్ నాట్ ఫర్గెట్.. వి విల్ నాట్ ఫర్గీవ్”) అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

“పుల్వామా ఎటాక్ లో అమరులైన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాం. మా సోదరుల కుటుంబసభ్యులకు అండగా ఉంటాం. ఈ దుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకుంటాం” అని సీఆర్పీఎఫ్ ప్రతిజ్ఞ చేసింది.

పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రవాదదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. కశ్మీర్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ ఉగ్రవాద దాడిపై యావద్దేశం ఆగ్రహంగా ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని చూస్తూ ఊరుకోవద్దని సోషల్ మీడియాలో రియాక్టవుతోంది.

Latest Updates