సాయంత్రం7 నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరూ కూడా రోడ్లపైకి రావొద్దన్నారు సీఎస్ సోమేశ్ కుమార్. ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ భయటకు రావొద్దన్నారు. అవసరమైతే ఈ కర్ఫ్యూ సమయాన్ని పెంచుతామన్నారు. ప్రజలు రోడ్లపై తిరగడానికి అనుమతి లేదన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామన్నారు. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అనుమతిస్తామన్నారు. ఎపిడమిక్ యాక్ట్ అమలు చేస్తున్నామన్నారు. రోడ్లపై ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. రాష్ట్ర సరిహద్దులు సీజ్ చేశామన్నారు. అన్నీ విద్యాసంస్థలు, షాపులు, అన్నీ బంద్ చేశామన్నారు. లాక్ డౌన్ కు  అందరు సపోర్ట్ ఇవ్వాలన్నారు.గ్రామాల్లో ఉపాధి పనులు చేసుకోవచ్చు. అలాగే రైతులు వ్యవసాయ పనులు చేసుకోవచ్చన్నారు. విదేశస్థులు ఎవరు బయటకు రావొద్దన్నారు. వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వారి పాస్ పోర్టుపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు.

 

Latest Updates