సీఎస్ కే రిలాక్స్ డ్ టీమ్.. ముంబై ఇండియన్స్ లో ఒత్తిడి ఎక్కువ

వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్ తోపాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటం తన అదృష్టమని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో భజ్జీ పాల్గొన్నాడు. ఈ సెషన్ లో ముంబై, సీఎస్ కే టీమ్స్ గురించి భజ్జీ పలు విషయాలు పంచుకున్నాడు. ‘సీఎస్ కే, ముంబై రెండూ వైవిధ్యమైనవి. చాలా మంచి టీమ్స్ అలాగే శక్తిమంతమైవి కూడా. ముంబై ఇండియన్స్ లో ప్రతిదీ ఫర్ఫెక్ట్​ గా ఉండాలి. అందుకోసం మీటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టీమ్ ను చాలా ప్రొఫెషనల్ గా రన్ చేస్తారు. ఈ జట్టు తరఫున నేను పదేళ్లు ఆడాను. ఇక, చెన్నైకి రెండేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇది చాలా రిలాక్స్ డ్ టీమ్. వీళ్లు ఎక్కువ మీటింగ్స్ నిర్వహించరు. ప్రతి విషయాన్ని ప్లేయర్లకే వదిలేస్తారు. మ్యాచ్ ప్రెషర్ కూడా చైన్నై జట్టుపై అస్సలు ఉండదు. మ్యాచ్ ఆడే రోజు దాకా అసలు మ్యాచ్ ఉందా లేదా అనేంత రిలాక్స్ డ్ గా టీమ్ ఉంటుంది. అదే ముంబై జట్టు లో ఆడినప్పుడు కొంచెం ఒత్తిడిగా అనిపించేది. ముంబై కి ప్రతి మ్యాచ్ గెలవాలనే ప్రెషర్ ఉంటుంది, ఒకరకంగా అదీ మంచిదే. నేను ముంబైని మిస్ అవుతున్నా. ఈ టీమ్ లో చాలా ఫన్ ఉంటుంది’ అని భజ్జీ పేర్కొన్నాడు.

Latest Updates