శ్రీలంకలో కర్ఫ్యూ ఎత్తివేత

కొలంబో: వరుస బాంబు పేలుళ్ల కారణంగా శ్రీలంకలో విధించిన కర్ఫ్యూను అక్కడి ప్రభుత్వం ఆదివారం ఎత్తివేసింది. పేలుళ్లలో ప్రేమయం ఉన్నట్లు భావిస్తున్న మరికొందరిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. షాంగ్రిలా, సిన్నామన్ హోటళ్లలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ కేసులో ఇబ్రహీం మహ్మద్ ఇర్ఫాన్ ను అరెస్టు చేశామన్నారు. శనివారం పోలీసులు సోదాలకు వెళ్లగా తమను తాము ముగ్గురు బాంబర్లు పేల్చుకున్నారని, అక్కడి నుంచి ఓ బాంబర్ ఫ్యామిలీని కాపాడినట్లు ఆయన చెప్పారు. ఇదిలాఉంటే.. ఆదివారం సాయంత్రం కొలంబోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆ దేశ అధ్యక్షుడు సిరిసేన పాల్గొన్నారు.

Latest Updates