కరెన్సీ కట్టల మండపంలో కొలువైన గణపతి

తమిళనాడు : కంచిలో కరెన్సీ నోట్లతో డెకరేట్ చేసిన వినాయక మంటపం అందరినీ ఆకట్టుకుంటోంది. కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గర్లోని సింఘ వినాయకర్ ఆలయం దగ్గర గత 14 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రూ.10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో వినాయక మంటపాన్ని  అలంకరించారు. 2000, 500, 200, 100, 50, 20, 10, 5 రూపాయల నోట్లతో మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కరెన్సీ నోట్ల మండపంలో కొలువైన గణపతినిని చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.

Latest Updates