2 నెలలకు రూ.6 లక్షల కరెంట్‌‌ బిల్లు

గోదావరిఖని, వెలుగు: సామాన్యులు ఎవరైనా ఎంత వినియోగించుకున్నా నెలకు మహా అంటే వెయ్యి రూపాయల కరెంట్‌‌‌‌ బిల్లు వస్తుంది. కానీ గోదావరిఖనిలోని రాంనగర్‌‌‌‌లో ఉండే మాస రాజం రేకుల ఇంటికి మాత్రం50101‒06218 నెంబర్‌‌‌‌పై రెండు నెలలకు కలిపి రూ.6 లక్షల 4  వేల 741 బిల్లు వచ్చింది. సోమవారం ఈ బిల్లును బిల్‌‌‌‌కలెక్టర్‌‌ ‌‌ఇవ్వగా, దానిని చూసిన రాజంకు షాక్‌‌‌‌కొట్టినంత పనైంది.  రాజం ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే, ఆగస్టు నెలలో మీటర్‌‌ ‌‌జంప్‌‌‌‌ అయిందని బిల్లు ఇవ్వలేదు. దీంతో తాను బిల్లు ఎలా చెల్లించాలని, సమస్యను పరిష్కరించాలని ఆగస్టు 28న ట్రాన్స్‌‌‌‌కో ఏఈకి వినతిపత్రం అందజేశాడు.

మీటర్‌‌‌‌ మార్పిస్తానని ఏఈ హామీ ఇచ్చాడు. కానీ ఆ ప్రయత్నం జరగకపోగా, సోమవారం తిరిగి బిల్‌‌‌‌కలెక్టర్‌‌‌‌ వచ్చి మీటర్‌‌‌‌ రీడింగ్‌‌‌‌ చూసి, బిల్లు ఇచ్చాడు. రెండు నెలలకు కలిపి 63,958 యూనిట్లు వాడుకున్నట్లు రశీదులో వచ్చింది.  మొత్తం రూ.6,04,741 బిల్లు చెల్లించాలంటూ ఆ రశీదును రాజం చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. గతంలో మండే ఎండాకాలంలో కూడా రూ.800 వరకు బిల్లు రాలేదని, ఇప్పుడు 6 లక్షలు కట్టమంటే ఏం చేయాలని రాజం తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు. దీనిపై ఎన్పీడీసీఎల్‌‌‌‌ అధికారులే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Latest Updates