కారుపై విరిగి పడిన విద్యుత్ స్తంభం.. త‌ప్పిన పెనుప్ర‌మాదం

జగిత్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ కారు అడ్డుగా వచ్చిన గేదేను తప్పించబోయి అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. దీంతో స్తంభం విరిగి కారుపై పడింది. కారులో బెలూన్లు ఓపెన్ అవ‌డంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కాగా, ఆ నలుగురు విద్యార్థులనీ, కరీంనగర్‌లోని ఓ కళాశాలలో చేరేందుకు జగిత్యాల నుంచి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Latest Updates