జొమాటో డెలివరీ బాయ్ ని చావగొట్టిన కష్టమర్లు

కుటుంబాన్ని ఒక్కడే పోషించాలి

ఇంట్లో ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల కమీషన్. రీసెంట్ గా కొత్త బైక్ కొన్నాడు. కొత్త బైక్ తో ఇంకా కష్టపడి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని అనేక  కలలు కన్నాడు. కానీ అంతలోనే దారుణం జరిగింది. పార్శిల్ తీసుకురావడం లేటైందని కష్టమర్లు డెలివరి బాయ్ ని చావగొట్టారు. దాడిలో బాధితుడి వెన్నపూస విరిగి మంచాన పడ్డాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన బాధితుడు కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

బెంగళూరు బెల్లందూర్ కు చెందిన జగదీష్ (25) జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బెల్లందూరు గేట్ సమీపంలో ఉన్న ఫ్లయింగ్ కప్ రెస్టారెంట్ నుంచి సర్జాపూర్ రోడ్ లో ఉన్న కష్టమర్ కు టిఫిన్ పార్శిల్ తీసుకొని వెళ్లాల్సి ఉంది.

కంపెనీ రూల్ ప్రకారం పార్శిల్ 40నిమిషాల లోపే చేరవేయాలి. బాధితుడు 20నిమిషాల్లోనే టిఫిన్ పార్శిల్ ను కష్టమర్ కు అందించాడు. అయితే 20నిమిషాలు లేటుగా వచ్చాడంటూ  డెలివరీ బాయ్ పై కష్టమర్ అమానుషంగా దాడి  చేశాడు. కష్టమర్ అతని స్నేహితుల దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుణ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బాధితుడు కోలుకోవడానికి  కొన్ని నెలల సమయం పడుతుందని, బైక్ నడపకూడదని చెప్పారు.

డాక్టర్ల సూచనలతో ఆందోళన

డాక్టర్ల సూచనలతో బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇంట్లో నేనొక్కణ్నే ఉద్యోగం చేసేది. నేను మంచనా పడితే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారంటూ కన్నీరు మున్నీరవుతున్నడు.

బాధితుడిపై జరిగిన దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates