3.4కిలోల బంగారం అక్రమ రవాణా…

చెన్నై ఎయిర్ పోర్టులో దొంగ బంగారం పట్టుడింది. అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. వారి దగ్గరనుంచి 3.4కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. దీని విలువ ఒక కోటీ 39 లక్షల రూపాయలని తెలిపారు. అయితే అక్రమ రవాణా చేస్తున్నవారు ఎక్కడి నుంచి వచ్చారన్నది చెప్పలేదు. మరిన్ని వివరాలు కనుక్కోడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈఘటన మంగళవారం సాయంత్రం జరుగగా.. బుధవారం మీడియాకు తెలిపారు అధికారులు.  చెన్నై ఎయిర్ పోర్ట్ ను బేస్ చేసుకుని ఇప్పటికే చాలా మంది బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు.

Latest Updates