అగర్ బత్తుల స్కామ్ బట్ట‌బయలు

చెన్నై: కస్ట‌మ్స్ ఆఫీసర్లు అగర్ బత్తుల స్కామ్ గుట్టు రట్టు చేశారు. వియత్నం నుంచి చెన్నైకి తీసుకువస్తున్న‌ 162 టన్నుల‌ అగర్ బత్తుల‌ను అక్క‌డి పోర్టులో పట్టుకున్నారు. ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ కోసం వీళ్లు అగర్ బత్తుల‌ను, అగర్ బత్తుల‌ పౌడరును దొంగతనంగా తీసుకొస్తున్న‌ట్లు గుర్తించారు. గత ఏడాది నుంచి కేంద్రం అగర్ బత్తుల‌ దిగుమతులపై ఆంక్ష‌లు పెట్టింది. దేశంలోని చిన్న చిన్న‌ అగర్ బత్తి తయారీదారులను కాపాడేందుకే ఈ ఆంక్ష‌ల‌ను పెట్టారు. అప్ప‌టి నుంచి విదేశాల నుంచి వీటి స్మ‌గ్లింల్ పెరిగింది. ఆసియాన్ దేశాల నుంచి వచ్చే అగర్ బత్తుల‌ పౌడర్ పై 15 శాతం క‌స్ట‌మ్స్ డ్యూటీ మినహాయింపు ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

 

Latest Updates