పన్నులు తగ్గించి మమ్మల్ని ఆదుకోండి: ఓఎన్జీసీ

  •  ప్రభుత్వానికి లెటర్ రాసిన ఓఎన్జీసీ

ప్రస్తుత సమస్యల నుంచి గట్టెక్కడానికి వెంటనే మినహాయింపులు ఇవ్వాలని మనదేశంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ ప్రభుత్వానికి లెటర్ రాసింది. పన్నుల భారాన్ని తగించడమే గాక , ధరల పెంపు, మార్కెటింగ్‌పై ఉన్న పరిమితు లను తొలగించాలని కోరింది. ధరలు తక్కువ ఉండటం వల్ల మాంద్యం సమయంలో కంపెనీని నడిపించడం కష్టంగా మారిందని చెప్పింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర కేవలం 20 డాలర్లు ఉంది. ఒక్కో మిలియన్ గ్యాస్ బ్రిటిష్ థెర్మల్ యూనిట్లకు 2.39 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్నారు. తాము ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ఖర్చు కంటే అమ్మకం ధర చాలా తక్కువగా ఉందని ఓఎన్జీసీ చెప్పింది. క్రూడాయిల్ ఇన్‌పుట్‌పై విపరీతంగా పన్నులు వేయడం వల్ల నష్టాలు వస్తున్నాయని అభ్యంతరం తెలిపింది. బ్యారెల్ ధర 45 డాలర్ల కంటే తక్కువ అయితే, ఆయిల్ సెస్ను తొలగించాల ని ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాదే లెటర్ రాసింది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన 20 శాతం రాయితీని సగం తగించాలని కోరింది.

Latest Updates