ఏటీఎం ను గ్యాస్‌‌‌‌‌‌‌‌ కట్టర్‌‌‌‌‌‌‌‌తో కట్‌‌‌‌‌‌‌‌చేసి చోరీ

జడ్చర్ల ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఏటీఎంలో 15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

జడ్చర్ల, వెలుగు: గ్యాస్‌‌‌‌‌‌‌‌ కట్టర్‌‌‌‌‌‌‌‌తో ఏటీఎంను కట్‌‌‌‌‌‌‌‌చేసి డబ్బు ఎత్తుకెళ్లిన ఘటన జడ్చర్ల టౌన్‌‌‌‌‌‌‌‌లో  సోమవారం రాత్రి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఎస్ బీఐ ఏటీఎంలోకి వెళ్లి మిషన్ కట్ చేసి 15 లక్షల డబ్బుతో పరారయ్యారు.  మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది పోలీసులకు కంప్లయింట్‌‌‌‌‌‌‌‌ చేశారు.  మహబూబ్ నగర్ డీఎస్పీ శ్రీధర్  క్లూస్ టీం తనిఖీ చేయించి కేస్‌‌‌‌‌‌‌‌ ఫైల్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఏటీఎంలో 40 లక్షల డబ్బు ఉంచామని కస్టమర్లు  డ్రా చేసుకోగా మిగతా డబ్బు ఎత్తుకెళ్లినట్లు ఎస్ బీఐ మేనేజర్ దీపిక తెలిపారు.

 

Latest Updates