కరోనాతో‘రోబో’కొట్లాట

చౌక రోబోలను అభివృద్ధి చేసిన కటక్ ఐటీఐ

కరోనాతో కొట్లాడేందుకు ఇప్పటికే రోబోలు రంగంలోకి దిగాయి. వాటికి తోడు మేమూ ఉన్నామంటున్నాయీ కొత్త రోబోలు. ఒక రోబో పేషెంట్లకు సేవలు చేస్తే.. ఇంకో రోబో వాళ్ల హెల్త్‌‌ను కాచుకుంటుంది. అవును, ఒడిశా కటక్‌‌లోని గవర్నమెంట్ ఐటీఐ ఈ రోబోలను తయారు చేసింది. శాక్‌ రోబోలిక్స్‌‌ ల్యాబ్‌‌ అనే స్టార్ట‌ప్ సాయంతో వాటిని తయారు చేసింది. ఒకదాని పేరు కోబో (కరోనా కంబాట్‌‌రోబో), ఇంకోదాని పేరు నిగా బో! హాస్పిటల్‌‌లోని పేషెంట్లకు ఫుడ్డు, మెడిసిన్స్‌‌, వాటర్ ‌‌అందించే సర్వీస్ చేసే రోబో కోబో. 20 కిలోల దాకా బరువును మోస్తుంది.

పేషెంట్లను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, టెలీ, వీడియో కన్సల్టేషన్‌ పనులు చేసేది నిగాబో. డాక్టర్లు పేషెంట్ల బెడ్‌ దగ్గరకు వెళ్ల‌కుండానే రోబోలతో చెక్‌ చేయొచ్చు. దీని ద్వారా పేషెంట్లతో డాక్టర్లు కాంటాక్ట్ కాకుండా చూడొచ్చన్నమాట. ఒక్కో దాని ధర సుమారు రూ.2.5 లక్షలట. ఐటీఐ పనితీరు చూసి ఒడిశా సీఎంనవీన్ ‌‌పట్నాయక్ ‌మెచ్చుకున్నారు కూడా.

Latest Updates