CWCలో తెలుగు నేతలు గల్లంతు : 51 మందితో కొత్త కమిటీ వేసిన రాహుల్

కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ. మొత్తం 51మందితో ఏర్పాటు చేసిన కమిటీలో 23మంది రెగ్యులర్ మెంబర్స్ ఉండగా, 18మంది శాశ్వత ఆహ్వానితులు, 10మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. అయితే తెలంగాణ, ఏపీ నుంచి ఒక్క నేతకు కూడా కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలో చోటు దక్కలేదు. రాహుల్, సోనియా, మన్మోహన్, మోతిలాల్ ఓరా, ఆజాద్, ఖర్గే ఆంటో ని, అహ్మద్ పటేల్, అంబికా సోని, ఉమెన్ చాందీ, సిద్దరామయ్య, తరుణ్ గోగోయ్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్ తో పాటు మరికొందరు నేతలు CWC మెంబర్లుగా ఉన్నారు.

శాశ్వత ఆహ్వానితులుగా చిదంబరం, శిలాదీక్షిత్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్సీ కుంతియా నియమించబడ్డారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మునియప్ప, జితన్ ప్రసాదా, బీపేందర్ హుడాతో పాటు తదితరులు ఉన్నారు. అయితే INTUC అధ్యక్షుడు సంజీవరెడ్డికి CWCలో బెర్తు దొరికింది. ఆ పదవిలో ఎవరున్నా…CWCలో సీటు ఖాయంగా ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates