CWC మీటింగ్ లో సోనియా :మోడీకి రివర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్

మోడీ మాట తీరు… ఆయన నిరాశను సూచిస్తున్నాయన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో సోనియా మాట్లాడారు. మోడీకి రివర్స్ కౌంట్ డౌన్ మొదలైందని ఆయన మాటలే ప్రతిబింబిస్తున్నాయన్నారు. RSS వ్యవస్థాగత నిర్మాణానికి, ఆర్థిక వనరులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వ్యూహాత్మక భాగస్వాములు కావాల న్నారు. దీనికోసం వ్యక్తిగత ఆశయాలను పక్కనపెట్టాలన్నారు సోనియా. మోడీ అబద్ధాలు, తనను తాను పొగుడుకునే సంస్కృతిని తిరస్కరిస్తున్నామన్నారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే. అగ్రి గ్రోత్ రేట్ 14శాతం ఉండాలని… అదెక్కడా కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు మన్మోహన్ సింగ్.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన CWC మీటింగ్ జరుగింది. CWCని పునర్ వ్యవస్థీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. పునర్ వ్యవస్థీకరించిన CWC అనుభవం, ఎనర్జీ కలయికగా అభివర్ణించారు రాహుల్. ఇది గతం, వర్తమానం, భవిష్యత్ ల మధ్య బ్రిడ్జ్ అన్నారు. దేశంలోని పీడిత, బాధిత ప్రజల పక్షాన పోరాడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. CWC మీటింగ్ కు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లు, మైనారిటీ, యూత్, కిసాన్ సెల్ అధ్యక్షులు హాజరయ్యారు. మొత్తం 239మంది సమావేశంలో పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates