CWC సమావేశం అసంపూర్తిగా ముగిసింది : హరీశ్

KID

ఢిల్లీ లో గురువారం (ఫిబ్రవరి-15  కేంద్ర జలవనరులశాఖమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన మీటింగ్ హాజరయ్యారు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల పై మీటింగ్ లో ప్రధానంగా చర్చ జరిగింది. AIBP కింద తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని గడ్కరీని కోరామన్నారు హరీశ్. దేవాదుల, బీమా ప్రాజెక్టులకు తక్షణమే నిధులివ్వాలన్నారు.

బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల ప్రక్రియ చేశాకే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ఖరారు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు హరీశ్. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు రావాలని నితిన్ గడ్కరీతో పాటు హర్షవర్దన్ లను ఆహ్వానించామన్నారు.

CWC సమావేశం అసంపూర్తిగా ముగిసిందన్న మంత్రి హరీశ్…. వచ్చే సమావేశంలోనైనా స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. పట్టిసీమలో రాష్ట్రానికి 45 టీఎంసీల వాటా ఉందన్నారు. అభినందనలతో పాటు ఆర్థిక సహాయం కూడా చేయాలని గడ్కరీని కోరామన్నారు హరీశ్. మార్చి 2019 కి ప్రాజెక్టులను పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. క్యాడ్వామ్ కింద అడిగిన వెయ్యి కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలన్నారు. నాబార్డు నుంచి రాష్ట్రాలకు నిధులు ఇచ్చినప్పుడే కేంద్రప్రభుత్వం చేపట్టిన లక్ష్యాలను చేరవచ్చని గడ్కరీకి వివరించామన్నారు. తమ అభిప్రాయాలతో గడ్కరీ సూత్రప్రాయంగా ఏకీభవించారని అన్నారు.  సీతారామ ప్రాజెక్టు పర్యావరణ, వన్యప్రాణి అనుమతులను మంజూరు చేయాలని కేంద్రమంత్రి హర్షవర్దన్ ను అడిగామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొదటి దశ అటవీ అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు.

Posted in Uncategorized

Latest Updates