గాంధీ, పటేల్ గడ్డపై CWC ప్లాన్స్ : మోడీ విధానాలపై సమరం

గుజరాత్ :  సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అధ్యక్షతన గుజరాత్ లో CWC మీటింగ్ జరుగుతోంది. సర్ధార్ వల్లాబాయ్ పటేల్ మెమోరియల్ ప్రాంగణంలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో డిస్కస్ చేస్తున్నారు నేతలు.

మీటింగ్ కోసం ఉదయమే అహ్మదాబాద్ చేరుకున్న పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…. సోనియా, ప్రియంక గాంధీలతో కలిసి… ముందుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమాన్ని సందర్శించి… అక్కడే ప్రార్థనల్లో పాల్గొన్నారు.

CWC మీటింగ్ లో…. లోక్ సభ ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికలను ఖరారు చేయనుంది కాంగ్రెస్. ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, ప్రసంగాల్లో ప్రస్తావించాల్సిన అంశాలకు ఆమోదముద్రవేస్తారు. మోడీ ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో కార్నర్ చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు.

బ్లాక్ మనీ, నిరుద్యోగం, రైతు సమస్యలు, ఆర్థిక అస్తవ్యస్తత, జాతీయ భద్రత, మహిళా సంక్షేమం వంటి అంశాలు, మోడీ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై దూకుడుగా వెళ్లాలని… ఎన్నికల్లో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను  ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. మీటింగ్ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి ఆమోదం తెలపనున్నారు నేతలు. ఇక ఇదే మీటింగ్ లో రాహుల్ సమక్షంలో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.

సాధారణంగా CWC మీటింగ్ ఢిల్లీలోనే జరుగుతుంది. కానీ రాహుల్ గాంధీ  ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. గుజరాత్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. 1961లో భావ్ నగర్ లో CWC భేటీ జరిగింది. 58 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు గుజరాత్ గడ్డపై సమావేశం జరుగుతోంది.

CWC మీటింగ్ పూర్తయ్యాక…. గాంధీనగర్ జిల్లాలోని అదలాజ్ లో జై జవాన్, జై కిసాన్ స్లోగన్ తో జన సంకల్ప్ పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంకగాంధీ హాజరై ప్రసంగిస్తారని సమాచారం.

Latest Updates