CWG-2018 : సైనా విక్టరీ

SAINAకామన్వెల్త్ గేమ్స్ లో మహిళల సింగిల్స మిక్సుడ్ టీం గ్రూపు-ఎలో శ్రీలంక క్రీడాకారిణి మదుషికపై 21-7, 21-4 తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. 261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్‌ లిప్టర్‌ మహ్మద్‌ ఇజార్‌ అహ్మద్‌ పసిడి సాధించగా, శ్రీలంక లిఫ్టర్‌ లక్మల్‌ 248 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 21వ కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో బుధవారం (ఏప్రిల్-4) న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. 12 రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించే కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 6600 మంది అథ్లెట్లు తమ పతక అదృష్టాలను పరీక్షించుకోనున్నారు.

Posted in Uncategorized

Latest Updates