అమ్మాయనుకొని చాటింగ్.. ఆ తర్వాత..

అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి ఓ యువ‌కుడి వ‌ద్ద నుంచి రూ.91,000 దోచుకున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు. తాను చాటింగ్ చేసిన వ్య‌క్తి అమ్మాయి కాద‌ని తెలుసుకున్న ఆ బాధితుడు.. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ న‌గ‌రం బొల్లారం కు చెందిన యువ‌కుడికి ఫేస్ బుక్ మెసెంజర్ లో సింగిల్ లేడి కావాలంటే ఈ నెంబర్ కు వాట్స్ యాప్ చేయండంటూ ఓ మెసేజ్ వచ్చింది.

ఆ మెసేజ్ లో ఉన్న నంబ‌ర్ కి వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. అమ్మాయి పేరుతో చాటింగ్ చేస్తున్న అవ‌త‌లి వ్య‌క్తి.. అందమైన యువతుల ఫోటోలు పంపి, డ‌బ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే … కోరుకున్న అమ్మాయి గంటలో ఇంట్లో ఉంటుందని ఆ యువ‌కుడిని న‌మ్మించారు. దీంతో అత‌డు వారి అకౌంట్లోకి 91 వేలు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు వారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో యువకుడి నెంబర్ ను సైబర్ నేరగాళ్లు బ్లాక్ చేశారు. దీనితో మోసపోయానని తెలుసుకున్న యువకుడు సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

cyber ​​criminals stole rs.91 000 from a person in hyderabad

 

Latest Updates