స్మార్ట్​ వాచ్​ కొంటున్నారా?  పిల్లలు జాగ్రత్త!

మీ పిల్లలకు స్మార్ట్​ వాచ్​ కొనిస్తున్నారా?  ఎందుకు? ఎక్కడున్నారో తెలుసుకునేందుకేగా? స్మార్ట్​ వాచ్​ ఉంటే మీ పిల్లలు సేఫ్​ అనుకుంటున్నారా?  మీ ఆలోచన తప్పు. ఎందుకంటే స్మార్ట్ వాచ్​ల కారణంగానే పిల్లలు కిడ్నాప్​ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సైబర్​ నిపుణులు. భద్రత పేరుతో  కొంటున్న స్మార్ట్​ వాచ్​లే పిల్లలకు భద్రత లేకుండా చేస్తున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే స్మార్ట్​ వాచ్​లను చాలా ఈజీగా హ్యాక్​ చెయ్యొచ్చట. ప్రముఖ బ్రాండ్​లకు చెందిన పిల్లల స్మార్ట్​ వాచ్​లను నార్వేకు చెందిన నేషనల్​ కస్టమర్​ కౌన్సిల్​(ఎన్​సీసీ) పరీక్షించింది. ఈ వాచ్​లు ఇంటర్నెట్​తో అనుసంధానమై ఉన్నందున హ్యాకర్లు, కిడ్నాపర్​లు వాచ్​ ఉన్న ప్లేస్​ను సులభంగా గుర్తిస్తారని, ఫలితంగా పిల్లలు ఏ సమయానికి ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. వాచ్​ను పెట్టుకున్న పిల్లలు తల్లిదండ్రులతో, స్నేహితులతో ఏం మాట్లాడుతున్నారో కూడా ఈజీగా వినొచ్చని చెబుతున్నారు. వాచ్​ ఉన్న జీపీఎస్​ లొకేషన్​ను చేంజ్​ చేసి, తల్లిదండ్రులను కూడా మరోచోటుకు రప్పించవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. ఎన్​క్రిప్ట్​ అవ్వకుండానే సైబర్​ నేరగాళ్లు ఇవన్నీ చేసేందుకు వీలుందని, వీలైనంత వరకు పిల్లల భద్రత కోసం ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్​లపై ఆధారపడకుండా ఉండడమే మేలని చెబుతున్నారు. ఎన్​సీసీ రిపోర్ట్​పై స్పందించిన ప్రముఖ వాచ్​ల రిటైలింగ్ సంస్థ జాన్ లెవిస్ పిల్లల స్మార్ట్‌‌వాచీ అమ్మకాలను సైతం నిలిపివేసింది.

Cyber ​​experts says that children are more likely to be kidnapped because of smartwatches

Latest Updates