దిశ ఘటనపై అసభ్యకర పోస్ట్ లు చేసిన వ్యక్తి అరెస్ట్

దిశ ఘటన పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐపీ ఆధారంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు . బాధితురాలు దిశ పేరుతో ఫేస్ బుక్ లో అనుచిత పోస్టులు చేశారు.   ఫేస్ బుక్ లో గ్రూప్ గా ఏర్పడి దిశపై అసభ్యకరంగా పోస్టులు చేశారు శ్రీ రామ్ గ్యాంగ్.  కేసు నమోదు చేసిన పోలీసులు సుమోటోగా తీసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గుంటూరు వెళ్లింది సీసీఎస్ టీం.

Latest Updates