సెలబ్రెటీలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే.. ఇలాంటివి రిపీట్ కావు

సోషల్  మీడియాలో తనను వేధిస్తున్నారంటూ.. ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యాంకర్ అనసూయ. ట్విట్టర్లో  ఓ అకౌంట్ పేరు మీద.. తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పోలీసులకు ట్వీట్ చేసింది. సాయి రాజేశ్ అనే వ్యక్తి కూడా అనసూయ పోస్ట్ చేసిన మెసెజ్ ను సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విటర్ ద్వారా ట్యాగ్ చేశారు.

దీనిపై స్పందించిన సైబర్  క్రైమ్  పోలీసులు… ఆ అకౌంట్ ఎవరు వాడుతున్నారో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కేసు నమోదు చేసేందుకు కోర్టుకు సమర్పించడానికి సైన్డ్ కాపీ కావాలి కాబట్టి.. అనసూయ కానీ, సాయి రాజేశ్ కానీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే FIR నమోదు చేస్తామన్నారు సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్. సెలబ్రెటీలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే.. ఇలాంటివి రిపీట్ కావన్నారు.

యాక్టర్స్, సెలబ్రిటీలు ఇటువంటి కామెంట్లు, పోస్టులు పట్టించుకోరనే ధీమాతోనే కొందరు ఆకతాయిలు ఇష్టమొచ్చిన కామెంట్సు పెడుతున్నారని, సెలబ్రిటీల తరఫున ఎవరు వచ్చి కంప్లయింట్ ఇచ్చినా అటువంటి వారిపై పక్కా యాక్షన్ తీసుకుంటామని ఆయన అన్నారు.

Latest Updates