‘కోటి రూపాయల లాటరీ’- మోసపోయిన మహిళ

కోటి రూపాయల లాటరీ వచ్చిందని నగరంలోని పాతబస్తీకి చెందిన మహిళని మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు.  లాటరీలో కోటి రూపాయలు తగిలాయంటూ ఫోన్ చేసి లక్షల రూపాయలు గుంజారు. నిజంగానే అదృష్టం వరించిందని అనుకున్న ఆ మహిళ.. వాళ్లు చెప్పినట్టుగా ప్రాసెసింగ్ ఫీజ్ పేరుతో దశల వారిగా అక్షరాలు 5 లక్షల రూపాయలు వారి అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేసింది.

ఆ నేరగాళ్లు మరి కొంత డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో అనుమానం వచ్చి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ ఫోన్ కాల్ ఫేక్ కాల్, ఆమె చెప్పిన ఆధారాల ప్రకారంగా ఎటువంటి లాటరీ లేదని తెలిపారు. ఆ నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు.

Cyber ​​criminals cheated a woman by claiming lottery about 1 crore rupees

Latest Updates