సైబర్ క్రిమినల్స్ చేతికి 2.9 కోట్ల మంది ఇండియన్ల వ్యక్తిగత డేటా

భారత దేశ చరిత్రలో మరో అతిపెద్ద సైబర్ క్రైమ్  జరిగింది. దాదాపు 2.9 కోట్ల మంది ఇండియన్ల వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ సైట్లో హ్యాకర్లు ఉంచారు. దీనికి సంబంధించి ఈ విషయాన్ని సైబల్ అనే ఆన్ లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇవాళ(శనివారం) ప్రకటించింది. ఉద్యోగ అన్వేషణలో ఉన్న 2.9 కోట్ల మంది వివరాలను ఉచితంగా ఉంచింది. ఇలాంటి లీకులు సాధారణమైన విషయమే అయినా… ఈసారి ఒక ఆందోళన కలిగించే అంశం ఉంది. ఎడ్యుకేషన్ , అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారం కూడా చోరీ అయినట్లు సైబల్ చెప్పింది. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, వర్క్ ఎక్స్ పీరియన్స్ తదితర వివరాలను కూడా బయటపెట్టిందని తెలిపింది. ఇటీవల ఫేస్ బుక్ హ్యాక్ కు గురైన విషయాన్ని కూడా ఈ సంస్థే చెప్పింది.

Latest Updates