కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో మహిళకు ఫోన్ చేసి..

కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో మహిళకు ఫోన్ చేసి డబ్బులు కొట్టేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన మంగళపల్లి లక్ష్మిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సైబర్ నేరగాళ్లు లక్ష్మికి మార్చి 7న ఫోన్ చేసి కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ. 25 లక్షలు గెలుచుకున్నట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని పొందాలంటే ముందుగా రూ. 2, 65000 చెల్లించాలని షరతు పెట్టారు. దాంతో లక్ష్మీ కొన్ని రోజుల తర్వాత సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కి డబ్బులు పంపింది. సైబర్ నేరగాళ్లు మళ్లీ మే 31న ఫోన్ చేసి.. మీరు వేసిన డబ్బులు కట్ అయ్యాయి. కాబట్టి మళ్లీ డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. దాంతో తాను మోసపోయానని లక్ష్మీ గ్రహించింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

శానిటైజర్ వాడటం సేఫేనా?

వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ..

మారటోరియంలో వడ్డీ వసూలు చేయకూడదు!

Latest Updates