సీపీ సజ్జనార్ హెచ్చరికలు..లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కేసులే

కరోనా వైరస్ పై ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకుంటుందని సైబరాబాద్  సీపీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన  కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ మూడో దశలో ఉన్నామన్న సీపీ.. వైరస్ పై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రాధమిక దశలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇరాన్, జర్మనీ, అమెరికాలో కరోనా వైరస్ సోకి మరణించే వారి సంఖ్య పెరిగిందన్నారు. వైరస్ వ్యాపిస్తుందని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా పబ్లిక్ గా తిరగడం, పార్టీలు, ఫంక్షన్ లకు అటెండ్ అవ్వడం వల్లే ఆయా దేశాల్లో ఎక్కువ మందికి వైరస్ సోకిందన్నారు.

బహిరంగంగా తిరగొద్దు

మూడో దశలో ఉన్నందున ప్రతీ ఒక్కరూ ఇతరులను కలవడంగాని, పార్టీలు చేసుకోవడం, బహిరంగంగా తిరగడం కాని చేయద్దన్నారు.  మార్చి 31వరకు ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని, కోవిడ్-19 యాక్ట్ ను క్రాస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు సహకరించాలి

లాక్ డౌన్ పై ప్రజలు సీరియస్ గా తీసుకోవాలని సీపీ కోరారు. హాలిడేస్ లో ఇతర ప్రాంతాలకు వెళ్లడం, కాలనీల్లో తిరగడం లాంటివి చేయకూడదని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉండాలని సలహా ఇచ్చారు.

ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించొద్దు

నగర వాసులు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించవద్దని సీపీ సజ్జనార్ అన్నారు. నగరం చుట్టు పక్కల ఉన్న 9 ప్రధాన రహదారుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని, ఎవరైనా ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే శిక్షిస్తామని  అన్నారు.

ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ అన్నీ రద్దు

ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ అన్నీ రద్దు చేస్తున్నట్లు సీపీ సూచించారు. క్యాబ్ సర్వీస్ , ఓలా, ఊబర్ వంటి ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లను రద్దు చేసినట్లు చెప్పారు. క్యాబ్ లు అద్దెకిచ్చిన యజమానులపై , డ్రైవర్లపై కోవిడ్ -19 యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి

ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ఏర్పాటు చేసిన  రంగారెడ్డి హెల్ప్ లైన్ 18004250817, 23230811,813,814,817 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. మెడిసిన్ , మాస్క్ లు ఎక్కువ ధరల్లో అమ్మినా, విదేశాల నుంచి ఎవరైనా వచ్చిన తమకు కాల్ చేయవచ్చని , నిత్యవసర సరుకులు అమ్మే షాపులైనా సాయంత్రం 7 నుంచి మూసివేయాలని ఉదయం 6 గంట నుంచి 7 గంటల వరకు షాపులు తెరవాలి. ఫుడ్‌ డెలివరీ ఆర్డర్లు కూడా సాయంత్రం 6 గంటలలోపే మూసివేయాలన్నారు సీపీ సజ్జనార్.

Latest Updates