తమిళనాడు టూ మధ్యప్రదేశ్.. శంషాబాద్ వద్ద అడ్డంగా దొరికిన దొంగలు

అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠాకు చెందిన 7 మంది సభ్యులను అరెస్ట్ చేశామన్నారు సైబారాబాద్ సీపీ సజ్జనార్. తమిళనాడులోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ కేసు  వివరాలను వెల్లడించారు సీపీ. ముఠాలో ఒకరైన అమిత్ వివేక్ శుక్ల పరారీలో వున్నాడన్నారు.  అక్టోబర్ లో లూథియానా, పంజాబ్ ముత్తూట్ ఫైనాన్స్ లో నగలు దోపిడీ చేసి అప్పటి నుండి  తప్పించుకుతిరుగుతున్నారన్నారు.  సైబరాబాద్ పోలీసులకు 22న ఉదయం అందిన సమాచారం మేరకు వెంటనే అలర్ట్ అయ్యామన్నారు.  మూడు పోలీస్ కమిషనర్ రేట్ ల పరిధిలో అన్ని పోలీస్ టీమ్స్ సెర్చ్  అపరేషన్ లో పాల్గొన్నాయన్నారు. గంటకు పైగా చేసింగ్ 100 కు పైగా పోలీసులు పాల్గొన్నారన్నారు.

తమిళనాడు లో ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ చేసి నేషనల్ హైవే నుండి మధ్యప్రదేశ్ కు పారిపోతుండగా శంషాబాద్ తొండూపల్లి వద్ద దొంగలను అరెస్ట్ చేశామన్నారు. తమిళనాడులో దోపిడీ చేసిన తర్వాత బంగారం బ్యాగులను ఓ కంటైనర్ లో తరలిస్తూ దాని వెనకాల దొంగలు ఫాలో అయ్యారన్నారు. దోపిడీ దొంగల చేతిలో వెపన్స్ ఉన్నాయన్నారు.  చాలా తక్కువ సమయంలో దోపిడీ గ్యాంగ్ ను స్పెషల్ ఆర్మ్, & కౌంటర్ పోలీస్ టీమ్స్ తో అలెర్ట్ చేసి దొంగలను అరెస్ట్ చేశామన్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. ముఠాలో మధ్య ప్రదేశ్, జార్కండ్ కు చెందిన వారున్నారన్నారు.  సైబరాబాద్ పోలీసులు..నిందితుల వద్ద నుండి 25 కిలోల బంగారు ఆభరణాలను,7 తుపాకులు, 10 మ్యాగ్జయిన్స్ (97) బుల్లెట్లను, కంటైనర్ లారీ, సుమో కారు, 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.12 కోట్లు ఉంటుందన్నారు.

దోపిడీ దొంగల ముఠాపై అయ రాష్ట్రాల్లో వివిధ కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ గ్యాంగ్ లో శంకర్ సింగ్ బాగల్ లుడియనలో ఓ హత్యా కేసులో ప్రమేయం ఉందన్నారు. దోపిడి ముఠా లుదియనలో 20 నిమిషాల్లోనే ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీ చేశారన్నారు. వెపన్స్ తో బెదిరించిన వారు లూథియానా ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బందిని బెదిరించారన్నారు. సుమో కారుతో పాటు దొంగల కంటైనర్ వాహనం సైబరాబాద్ పరిధిలో రాగానే పట్టుకున్నామన్నారు సీపీ.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం

Latest Updates