గ్రేటర్ ఏర్పాట్లను సమీక్షించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సమీక్షించారు.  ప్రజలందరూ నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు ఉండాలని ఆయన సిబ్బందికి పలు సూచనలిచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని 38 మున్సిపాలిటీలలో ని 674 పోలింగ్ లొకేషన్స్ లోని 2569 పోలింగ్ స్టేషన్లలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజేంద్రనగర్, మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై ఇచ్చిన సూచనలు, సలహాలిచ్చారు. రాజేంద్రనగర్ పద్మశాలిపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లక్ష్మీగుడా వాంబే  కాలనీ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, లక్ష్మిగుడా మండల పరిషత్తు పాఠశాల, నౌ నంబర్ సెట్విన్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్, సిఖ్ చావని, రాంబాగ్ స్కౌట్స్ హై స్కూల్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అత్తాపూర్ తదితర ప్రాంతాల వద్ద ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్ల ను సందర్శించి సూచనలు చేశారు సీపీ. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు.. సిబ్బందికి సూచనలిచ్చారు. ప్రజలందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా  సీపీ సజ్జనార్ కోరారు.

 ఎన్నికల పటిష్ట నిర్వహణలో భాగంగా సైబరాబాద్ లోని 38 డివిజన్ లకు గాను దాదాపుగా 13,500  మంది (10,500 మంది సివిల్ పోలీసులు, 3000 మంది ఏఆర్) పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారన్నారని ఆయన వివరించారు. ఇప్పటికే గుర్తించిన 243 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో/ సమస్యాత్మక ప్రాంతాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ లొకేషన్ లో ఇద్దరు పోలింగ్ లొకేషన్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామని.. అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో పది సీసీటీవీ మౌంటెడ్ వెహికిల్ కెమెరాలు

సైబరాబాద్ పరిధిలో 10 సీసీటీవీ మౌంటెడ్ హెహికల్ కెమెరాలనును ఏర్పాటు చేస్తున్నామని..  వీటిద్వారా ఎన్నికల వేళ జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరవేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం  ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల వేళ విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందికి సూచించారు.  సీపీ సజ్జనార్  వెంట డీసీపీ శంషాబాద్ ఎన్ ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., సీఎఆర్ ఏడీసీపీ మాణిక్ రాజ్, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ కుమార్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, రాజేంద్రనగర్ ఇన్ స్పెక్టర్ సురేష్, మైలర్ దేవ్ పల్లి ఇన్ స్పెక్టర్ నరసింహ, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

for more News…

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్

రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్

Latest Updates