అప్ర‌మ‌త్తంగా ఉండ‌డి.. అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రాకండి

హైద‌రాబాద్: వాతావరణ శాఖ సూచనలను అనుసరించి ప్రజలంతా రానున్న రెండు, మూడు రోజుల వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి అనవసరంగా బయటకు రావద్దని అన్నారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంపుకు గురైన ప‌లు ప్రాంతాల‌ను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తదితర అధికారులు, ఎస్ఓటీ బృందంతో కలిసి వరుసగా 5వ రోజు స్వయంగా పర్యటించి సమీక్షించారు. అలీ నగర్ , సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీలల్లోని ని ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షిణ సహాయక చర్యలుగా వారికి అవసరమైన సాయం అందించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శ‌నివారం రాత్రి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింద‌ని, అలీ నగర్ , సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీలల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఇబ్బంది ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అందస్తున్నామన్నారు. అధికారులంతా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రకృతి సృష్టించిన విలయంలో అధికారులు, ప్రజలంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలన్నారు.

Latest Updates