అంతరాష్ర్ట దొంగగా మారిన హోంగార్డ్ అరెస్ట్

Cyberabad Police arrests Interstate thief

వరుస దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడి నుంచి రూ.20లక్షల విలువైన 62 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డుగా పనిచేసి దొంగగా మారిన అంతర్రాష్ట దొంగ వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ గురువారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావుతో కలిసి వెల్లడించారు.

జల్సాలకు అలవాటు పడి

మహారాష్ట్ర  బాబుల్గాన్ వట్కేడ్ గ్రామానికి చెందిన అమోల్ అశోక్ మీర్జా(30) ఎలక్ట్రీషియన్‌‌‌‌. కొంత కాలం నాగపూర్ లో హోంగార్డ్ గా పనిచేస్తూ జల్సాలకు అలవాడు పడ్డాడు. వచ్చే జీతం సరిపోకపోవడంతో జాబ్ ను వదిలేశాడు. ఈజీ మనీ కోసం తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌‌‌‌ చేసేవాడు. అందుకు రైళ్ళలో హైదరాబాద్ చేరుకుని సిటీతో పాటు పరిసర పట్టణాల్లో పగలు రెక్కి వేసి రాత్రి చోరీలకు పాల్పడేవాడు. పక్కా స్కె చ్ ఇళ్లలో చోరీలు చేసి సొంతూరు పారిపోయేవాడు. సొత్తు అమ్మగా వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు పెట్టేవాడు.

33 దొంగతనాలు

మహారాష్ట్రలోని  వివిధ ప్రాంతాల్లో అశోక్ మీర్జా18 చోరీలు చేసి 2014 నాగపూర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లా డు. విడుదలైన తర్వాత అతడి దృష్టి హైదరాబాద్‌‌‌‌పై పడింది. రైళ్ళలోఇక్కడికి వచ్చి చోరీలు చేసి తిరిగి వెళ్లిపోయేవాడు. ఇలా హైదరాబాద్(5),సైబరాబాద్(5),-రాచకొం డ(1),వరంగల్(3),సంగారెడ్డి (1)ప్రాంతాల్లో మొత్తం 15 చోరీలు చేశాడు. గతడిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు కేపీ-హెచ్‌‌‌‌బీ, మియాపూర్ లో 5 ఇళ్లను దోచేశాడు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేపీహెచ్‌‌‌‌బీ పోలీసులు సీసీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితుడు మరోసారి చోరీ కోసం సిటీకి రావడంతో కూకట్ పల్లిలో పోలీసులకు పట్టుబడ్డాడు.

Latest Updates