రాచకొండలో ప్రమోషన్ల సందడి

cyberabad police got promotions and says thanks to CP Mahesh Bhagavat

సైబరాబాద్: ఉమ్మడి సైబరాబాద్ (సైబరాబాద్, రాచకొండ, వికారాబాద్) పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్పీసీలు (అర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్), ఏఆర్ హెచ్సీలు (అర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్), ఏఆర్ఎస్ఐలు (అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు) .. ఏఆర్ హెచ్‌సీలు, ఏఆర్ఎస్ఐలు, ఆర్ఎస్ఐ (రిజర్వ్ లు సబ్ ఇన్ స్పెక్టర్లు) గా మొత్తం 805 మంది ప్రమోషన్లు పొందారు.
అర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ నుంచి అర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గా 601 మంది, అర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా 179 మంది, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు నుంచి రిజర్వ్ లు సబ్ ఇన్‌స్పెక్టర్లు గా 25 మంది ప్రమోషన్లు పొందారు.

అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (96 మంది), రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 15 మంది ప్రమోషన్లు పొందారు. ఏఆర్ పీసీ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా 296 మంది పదోన్నతి పొందారు.

ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన పోలీసులు..  చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను వచ్చేందుకు కృషి చేసిన సీపీ మహేష్ భగవత్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., పదోన్నతులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ముందు కూడా కష్టపడి పని చేస్తూ పోలీస్ డిపార్ట్‌మెంట్ కు మంచి పేరు తీసుకు రావలన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో మరిన్ని ప్రమోషన్లు అందుకోవాలన్నారు.

Latest Updates